హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎర్రగుంట్లలో పటిష్ట పోలీసు బందోబస్తు

KDP: ఎర్రగుంట్ల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద శనివారం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ విశ్వనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కొండాపురం సీఐ రాజా, ముద్దనూరు సీఐ నగేష్ బాబు మరియు ఇతర పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.