హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మదనపల్లి నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

అన్నమయ్య: మదనపల్లిలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్ కేంద్రానికి వెళ్లే మార్గం వద్ద పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరిమితికి మించి అనుచరులతో వెళ్లేందుకు యత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం నెలకొంది.