చాలామంది మెడ నొప్పితో ఇబ్బంది పడుతుంటారు. గంటల తరబడి ఫోన్ చూస్తూ, ల్యాప్టాప్పై వంగి కూర్చోవడమే దీనికి ప్రధాన కారణం. అందుకే నిటారుగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. ప్రతి అర్ధగంటకోసారి చిన్న విరామం తీసుకుని, మెడను మెల్లగా తిప్పుతూ వ్యాయామం చేయండి. నొప్పి ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటితో కాపడం పెట్టండి. రోజూ తగినంత నిద్ర, సరైన తలగడ వాడటం చాలా ముఖ్యం.
ఆరోగ్యం
మెడ నొప్పితో బాధపడుతున్నారా?


