హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాయకల్ప అవార్డుకు ఎంపికైన బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వంద పడకల ఏరియా ఆసుపత్రి కాయకల్ప 2025-26 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిందని ఆసుపత్రి సూపరింటెండెంట్ రవికుమార్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. బెస్ట్ రన్నరప్ గా ఎంపికై రూ.10 లక్షల నగదు బహుమతి అందుకోనున్నామని, ఆసుపత్రి సిబ్బంది కృషిని అభినందించారు.