హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్రామసభ.. ఎల్‌నినో పట్ల అప్రమత్తంగా ఉండాలి'

RR: నందిగామ మండలం వెంకమ్మగూడలో సర్పంచ్ గొర్లపల్లి అశోక్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం సాగు, తాగునీరు, విద్యుత్‌పై పడే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎల్‌నినో ప్రభావం వల్ల జరుగుతున్న పరిస్థితులను ప్రజలకు వివరించారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని విజ్ఞప్తి చేశారు