హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో 144 సెక్షన్ అమలు... సీఐ

EG: కొవ్వూరు మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో 144 సెక్షన్ అమల్లో ఉందని పట్టణ CI పి. విశ్వం తెలిపారు. మున్సిపల్ కార్యాలయానికి 100 మీటర్ల దూరంలోనే వాహనాలు నిలిపివేస్తామని తెలిపారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థితో పాటు ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతిస్తామన్నారు. రాజకీయ పార్టీల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.