హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వైసీపీ ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ ప్రియాంక బాయి

NDL: ఆత్మకూరు మున్సిపల్ ఛైర్మన్ పదవికి వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ ప్రియాంక బాయి నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులైన జవహర్ నాయక్, శారదాబాయి దంపతుల పెద్ద కుమార్తె అయిన ఆమె.. కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ప్రజాసేవ లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని, అవకాశం కల్పిస్తే పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.