ప్రకాశం: కనిగిరి మున్సిపాలిటీలోని 32 వార్డులకు సంబంధించి శుక్రవారం స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల అసిస్టెంట్ అథారిటీ, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల స్వీకరణ గదులను పరిశీలించారు. శనివారం మంచి రోజు కావడంతో అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కనిగిరిలో నామినేషన్ కేంద్రాల పరిశీలన


