హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముట్లూరులో విస్తృత కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌

GNTR: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంతో పాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు గుంటూరు జిల్లా పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలు చేపడుతోంది. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు వట్టిచెరుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ముట్లూరు గ్రామంలో శుక్రవారం కార్డాన్‌ అండ్‌ సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు.