హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూదం ఆడుతూ పోలీసులకు చిక్కిన ఐదుగురు

KNR: చొప్పదండి మండలం తొగరుమామిడికుంటలో జూదం ఆడుతున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాజ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తొమ్మిది మంది జూదం ఆడుతుండగా ఐదుగురు పట్టుబడ్డారు. మరో నలుగురు పరారయ్యారు. వారి నుంచి రూ.14,140 నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, ఆరు బైకులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.