హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏడో రోజు కాళరాత్రి రూపంలో అమ్మవారి దర్శనం

నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు అమ్మవారు కాళరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు