SRCL: చందుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో దసరా, సద్దుల బతుకమ్మ పండుగల సందర్భంగా సర్పంచ్ నారాగుల వాణి గంగస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలోని వీధులతో పాటు బతుకమ్మ తెప్ప, చెరువు పరిసరాలను దీపాలతో అలంకరించడంతో గ్రామం కొత్త శోభను సంతరించుకుంది. పండుగకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడంపై గ్రామస్తుల హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ
పండుగ వెలుగుల్లో రామారావుపల్లి


