హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాత్రివేళల్లో గుట్టుగా ఇసుక తరలింపు

KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలోని మల్లెపచ్చం, పాపయ్యపల్లె వెళ్లే దారిలో వాగు ఎండిపోవడంతో అక్రమార్కులు ఇసుక దందాకు తెరలేపుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా రాత్రివేళల్లో గుట్టుగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తూ, అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.