హైదరాబాద్: 28°C
తెలంగాణ

లక్షెట్టిపేటలో నిరుపయోగంగా సులభ్ కాంప్లెక్స్‌లు

MNCL: లక్షెట్టిపేట పట్టణంలో రూ.10 లక్షలతో నిర్మించిన రెండు సులభ్ కాంప్లెక్స్‌లు నిరుపయోగంగా మారాయి. గాంధీ చౌక్, ఐబీ, ఊత్కూర్ చౌరస్తా సమీపాల్లో ఏర్పాటు చేసిన కాంప్లెక్స్‌లకు నిత్యం తాళాలు వేసి ఉంటున్నాయి. చుట్టుపక్కల దుకాణాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు ఉండటంతో పాటు ప్రయాణికులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో నిర్మించినా, ప్రజలకు అందుబాటులో లేకపోవడంపై స్థానికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.