హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నిరంతర విద్యుత్ సరఫరాయే లక్ష్యం'

BDK: జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం సమీపంలోని 400 KV సబ్‌స్టేషన్‌ను TGNPDCL CMD కర్నాటి వరుణ్ రెడ్డి నిన్న పరిశీలించారు. రాబోయే రోజుల్లో పెరిగే లోడ్‌కు తగ్గట్టు ముందస్తు ప్రణాళికతో నిరంతర విద్యుత్ ఇవ్వాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్లను నిరంతరం పర్యవేక్షించాలని, అత్యవసర సమయాల్లో త్వరగా సరఫరా పునరుద్ధరించాలని సూచించారు. ఆయనతో పాటు SE G.మహేందర్ పాల్గొన్నారు.