మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాపూర్లో రెండు కార్లు బైక్ను ఢీకొన్న ప్రమాదంలో షహనాబేగం (40) మృతి చెందారు. భర్త షాకీర్ తీవ్రంగా గాయపడగా, కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. వైద్య కళాశాల విద్యార్థులు రెండు కార్లలో అతివేగంగా రేసింగ్ చేస్తూ.. ప్రమాదానికి కారణమైనట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తెలంగాణ
కార్ల రేసింగ్ ఉసురు.. మహిళ మృతితో విషాదం


