హైదరాబాద్: 28°C
తెలంగాణ

భీమేశ్వర ఆలయంలో సినీ నటుల ప్రత్యేక పూజలు

SRCL: వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో సినీ నటులు సాయికుమార్, రామ్ జగన్ ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం రాత్రి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా, ఆలయ పీఆర్వో పెరిక శ్రీనివాస్ శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేసి సత్కరించారు. ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.