WGL: జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సమయంలో బియ్యం, నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల వ్యవధిలోనే బియ్యం ధర కిలోకు రూ.15 వరకు పెరగడంతో కుటుంబ బడ్జెట్పై భారం పడుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
కొండెక్కిన బియ్యం ధరలు


