హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష

MDCL: బాలికపై లైంగిక నేరానికి పాల్పడిన కేసులో నిందితుడికి కోర్టు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. పిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మల్కాజ్‌గిరి పోలీసులు స్పష్టం చేశారు. బాలల భద్రతకు భరోసా కల్పిస్తూ, బాధితులకు న్యాయం జరిగేలా కేసుల దర్యాప్తు, విచారణలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నట్లు పేర్కొన్నారు.