హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

NRML:నిర్మల్ పట్టణంలోని విశ్వనాథ్‌పేట్ విద్యుత్ ఉపకేంద్రంలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అలాగే పెంబి విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరాలో అంతరాయం ఉంటుందని అధికారులు తెలిపారు. వినియోగదారులు గమనించాలని సూచించారు.