హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిరుపయోగంగా మారుతున్న కుభీరు క్రీడా మైదానాలు

NRML: కుభీరు మండలంలో యువత క్రీడలపై ఆసక్తి పెంచుకునేందుకు గతంలో నిర్మించిన క్రీడా మైదానాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారుతున్నాయి. ధార్ కుభీరు గ్రామంలోని మైదానంలో కట్టెలు, ట్రాక్టర్‌ను ఉంచడంతో యువత ఆటలు ఆడుకునే అవకాశం లేకుండా పోయింది. అధికారులు స్పందించి మైదానాన్ని ఆక్రమణల నుంచి తొలగించి, క్రీడలకు అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.