MBNR: గత ప్రభుత్వంలో బాలానగర్(M) నేరళ్లపల్లి నుంచి ఉటుకుంటుతండా మధ్య BT రోడ్డు నిర్మాణానికి కంకర పరిచి వదిలేశారు. గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ. 2.28 కోట్లతో 4 కి.మీ మేర రోడ్డుకు అప్పటి మంత్రి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటికీ పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
అరకొర పనులు.. అర్ధంతరంగా తారు రోడ్డు


