హైదరాబాద్: 28°C
తెలంగాణ

మచ్చాపూర్‌లో భూముల రీసర్వే ప్రారంభం

MLG: భూ వివాదాల పరిష్కారానికి మచ్చాపూర్‌లో పంట భూముల రీసర్వే ప్రారంభించారు. తహసీల్దార్ కుసుమ రవీందర్, సర్పంచ్ జంపాల ప్రభాకర్ శుక్రవారం ఈ ప్రక్రియను ప్రారంభించారు. 1970లో భూదాన్ బోర్డు ద్వారా రైతులకు భూములు పంపిణీ చేసి పట్టాలు ఇచ్చినా, కొన్ని లోపాలు, పట్టాల జారీలో సమస్యలతో వివాదాలు ఏర్పడ్డాయి. మంత్రి సీతక్క చొరవతో భూ భారతి రీసర్వేకు చర్యలు చేపట్టారు.