హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపే సద్దుల బతుకమ్మ.. దద్దరిల్లనున్న హైదరాబాద్!

HYD: సద్దుల బతుకమ్మ వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సంబరాలు రేపటితో ముగియనున్నాయి. ఉపాధి కోసం నగరానికి వచ్చిన వారంతా ఇప్పటికే పల్లెబాట పట్టగా.. లోకల్ హైదరాబాదీలు ఇక్కడే వేడుకలకు సిద్ధమయ్యారు. ట్యాంక్‌బండ్, సరూర్‌నగర్ స్టేడియం, మణికొండ బతుకమ్మ పార్క్, పీర్జాదిగూడ, మేడ్చల్ పరిసరాల్లో పూల పండుగ సందడి అంబరాన్నంటనుంది.