KDP: వేంపల్లి మండలం నందిపల్లె పార్వతీ సమేత శ్రీ నందీశ్వరాలయంలో ఈనెల 19న చండీ మహాయాగం నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకుడు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ జగజ్జనని శ్రీ చండీ అమ్మవారి అనుగ్రహంతో యాగం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దుష్టశక్తులు తొలగి ప్రజలకు ఐశ్వర్యం,ఆయురారోగ్యాలు కలగాలని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
19న నందిపల్లెలో శ్రీ చండీ మహాయాగం


