JN: స్టేషన్ఘన్పూర్లోని శివాజీ చౌక్ వద్ద ఓ యువకుడు బస్సు అద్దాలను రాళ్లతో పగులగొట్టాడు. శుక్రవారం ట్రాలీ వాహనం, ఆర్టీసీ బస్సు స్వల్పంగా తాకడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు అఖిల్ బస్సు అద్దాలను ధ్వంసం చేయడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు అఖిల్, వంశీని పోలీస్స్టేషన్కు తరలించి విచారణ చేపట్టారు.
తెలంగాణ
యువకుడి వీరంగం.. బస్సు అద్దాలు ధ్వంసం


