హైదరాబాద్: 28°C
తెలంగాణ

బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కోదండరాం

మహబూబాబాద్‌ బతుకమ్మ పండుగ తెలంగాణకు ప్రత్యేకమైన పండుగ అని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. తెలంగాణ జానపద వృత్తి కళాకారుల మహా సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి పట్టణంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జానపద కళాకారులు కోలాటాలు వేస్తూ నిర్వహించిన ప్రదర్శనలో పాల్గొన్నారు. పలువురు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.