ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన బార్ అండ్ రెస్టారెంట్ను లక్కీ డ్రా పద్ధతిలో కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. ఈ బార్ కోసం ఈనెల 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించగా మొత్తం 207 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. లక్కీ డ్రాలో 102వ నంబరు దరఖాస్తుదారుడైన మల్లు రమేష్ గౌడ్ ఎంపికైనట్లు వెల్లడించారు.
తెలంగాణ
లక్కీ డ్రా పద్ధతి ద్వారా బార్ కేటాయించిన కలెక్టర్


