హైదరాబాద్: 28°C
తెలంగాణ

నగరంలో పూలకు ఫుల్ డిమాండ్..!

HYD: సద్దుల బతుకమ్మ, దసరా సమీపిస్తున్న వేళ సిటీలో పూల ధరలు పెంచేశారు. బంతి, గునుగు పువ్వులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. గునుగు పువ్వు 5 కట్టలు రూ. 50 ఉండగా నిన్న సాయంత్రం నుంచి రూ. 100 చొప్పున విక్రయిస్తున్నారు. బతుకమ్మకు అవసరమయ్యే ముఖ్యమైన పూవు గునుగు కావడంతో ధర ఎక్కువ ఉన్నా కొనడం తప్పడం లేదని కొనుగోలుదారులు చెబుతున్నారు.