హైదరాబాద్: 28°C
తెలంగాణ

వెళ్తున్న బైక్‌లో మంటలు.. పూర్తిగా దగ్ధం!

MDCL: కూకట్‌పల్లిలోని జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో ద్విచక్ర వాహనం అగ్నిప్రమాదానికి గురైంది. వెళ్తున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన వాహనదారుడు వెంటనే బైక్ దిగి దూరంగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది. చూస్తుండగానే మంటలు వ్యాపించి వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.