JN: తరిగొప్పుల మండలం బొంతగట్టునాగారంలో వెండి ఆభరణాలకు మెరుగు పెడతామని ఇద్దరు వ్యక్తులు మోసానికి యత్నించారు. శుక్రవారం బిహార్కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ కుటుంబానికి చెందిన 80 తులాల వెండి ఆభరణాలకు మెరుగుపెడుతూ అధికంగా తరుగు తీయడంతో బాధితులు నిలదీశారు. గ్రామస్థులు వారిని GPలో బంధించి ప్రశ్నించగా, రూ.లక్ష ఫోన్పే చేయడంతో విడిచిపెట్టినట్లు సమాచారం.
తెలంగాణ
వెండికి మెరుగు పెడతామని మోసం


