హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్సిటీ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు..!

NLG: అంబేద్కర్ వర్సిటీ UG 2, 3, PG రెండో సంవత్సరం విద్యార్థుల ట్యూషన్ ఫీజు చెల్లింపు గడువును Nov 7 వరకు పొడిగించినట్లు రీజినల్ కో- ఆర్డినేటర్ బి. అనిల్ కుమార్ తెలిపారు. డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల విద్యార్థులు కూడా నిర్ణీత గడువులోగా ఫీజులు చెల్లించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం విద్యార్థులు సమీపంలోని స్టడీ సెంటర్‌లను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.