HNK: పరకాల మండలం పోచారం చెందిన యక్షగాన కళాకారుడు మహమ్మద్ అక్బర్ పాషా సుద్దాల జానకమ్మ–హనుమంతు జాతీయ పురస్కారం–2026కు ఎంపికయ్యారు. రామాయణ ఇతివృత్తంతో యక్షగాన ప్రదర్శనలు చేస్తూ భారతీయ సంస్కృతిని చాటుతున్నందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ శుక్రవారం తెలిపారు. ఈ నెల 26న హైదరాబాద్లో అవార్డు ప్రదానం చేయనున్నారు.
తెలంగాణ
జాతీయ పురస్కారానికి అక్బర్ పాషా ఎంపిక


