హైదరాబాద్: 28°C
తెలంగాణ

​ముగిసిన కుస్తీ పోటీలు

SRD: మైత్రి మైదానంలో రెండు రోజుల పాటు, హోరాహోరీగా సాగిన ఎస్జీఎఫ్ అండర్-17 రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఆరోగ్యకరమైన సమాజం క్రీడలతోనే సాధ్యమవుతుందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటి విజేతలుగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.