SDPT: గతంలో కేసీఆర్ పాలనలో గోదావరి నీటితో కూడవెల్లి వాగు పరివాహకం సస్యశ్యామలమైందని, కొండపోచమ్మ, మల్లన్నసాగర్లతో పంట పొలాలు కళకళలాడాయని ఎమ్మెల్యే తెలిపారు. నేడు నదులు పొంగుతున్నా పంపులు ఆన్ చేయక, సాగునీరివ్వక రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా మోటార్లు ఆన్ చేసి పంటలకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ
సాగునీరు విడుదల చేయక రైతులకు తిప్పలు: ఎమ్మెల్యే


