హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా మైనారిటీ అధికారిగా జలాలుద్దీన్ అక్బర్

కరీంనగర్ జిల్లా మైనారిటీ అధికారిగా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ జలాలుద్దీన్ అక్బర్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం రెవెన్యూ అధికారి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసి మైనారిటీల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.