హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడు మృతి

NZB: నిజామాబాద్ నగరంలోని పులాంగ్ చౌరస్తా వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ కార్మికుడు విఠల్ (46) మృతి చెందారు. హనుమాన్ నగర్‌కు చెందిన ఆయన మున్సిపాలిటీ జోన్‌-2లో పనిచేస్తున్నారు. ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.