WGL: నెక్కొండ మండలం గుండ్రపల్లి గ్రామంలో కడుపునొప్పి భరించలేక హుస్సేన్బీ (68) అనే వృద్ధురాలు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నయం కాకపోవడంతో మనస్తాపం చెంది గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి మృతిచెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.
తెలంగాణ
కడుపునొప్పి భరించలేక వృద్ధురాలి ఆత్మహత్య


