హైదరాబాద్: 28°C
తెలంగాణ

పసుపు ధర ఎంతో తెలుసా..?

NZB: వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం పసుపు కొమ్ములకు మంచి ధర లభించింది. గరిష్ఠంగా క్వింటాలుకు రూ.24,260, మధ్యస్థ ధర రూ. 21,700, కనిష్ఠంగా రూ. 17,900 పలికింది. మొత్తం 543 క్వింటాళ్ల పసుపు కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. సోయాకు గరిష్ఠంగా రూ.7,369, కనిష్ఠంగా రూ.6,851 ధర లభించగా, 586 క్వింటాళ్ల సోయా మార్కెట్‌కు వచ్చినట్లు తెలిపారు.