HYD: సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సీతక్క మహిళా జర్నలిస్టులతో కలిసి బతుకమ్మ ఆడి, పాడారు. బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మగౌరవం, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతి పరిరక్షణ, మహిళల ఐక్యతకు ఈ పండుగ నిదర్శనమని తెలిపారు.
తెలంగాణ
సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు


