హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసిన భోగ శ్రావణి

JGL: శ్రీ దుర్గాగాయత్రీ, శ్రీ భక్త మార్కండేయ దేవాలయంతో పాటు శ్రీ దుర్గా సేవాసమితి, శ్రీ హిందూ కాళికామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపాలను BJP జిల్లా ఇంఛార్జ్ భోగ శ్రావణి సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, జగిత్యాల పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు.