హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటం అవసరం: సీఐటీయూ

GDWL: పాఠశాలల పరిశుభ్రతకు శ్రమిస్తున్న స్వీపర్లకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా వేధించడం తగదని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ అన్నారు. శుక్రవారం వడ్డేపల్లిలో నిర్వహించిన సమావేశంలో హెచ్. రాముడు కన్వీనర్‌గా స్వీపర్ల నూతన కమిటీని ఎన్నుకున్నారు. వేతనాలను నేరుగా ప్రతినెలా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు.