హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలి'

NLG: ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు. శుక్రవారం నల్గొండ కలెక్టరేట్‌లో కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. రానున్న నాలుగైదు నెలల పాటు ప్రతి ఇంటికి తాగునీరు అందేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.