హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఫుడ్ పాయిజన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి'

MDK: నర్సాపూర్ వన్ ప్యాలెస్ రెస్టారెంట్‌లో కలుషిత ఆహారం తిని 36 మంది అస్వస్థతకు గురవ్వడం సాయి అనే యువకుడు మృతిచెందడంపై సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ DRO అంబదాస్ రాజేష్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ప్రదీప్‌లకు వినతిపత్రం అందజేశారు. కలుషిత ఆహారం కారణంగా ఒకరి ప్రాణం పోవడం పట్ల జిల్లా కార్యదర్శి కె.నర్సమ్మ ఆందోళన చెందారు.