హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ, సీసీ రోడ్లు లేక ప్రజల అవస్థలు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్‌ నూర్‌ కాలనీలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల సమయంలో హామీలిచ్చి తర్వాత పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి సమస్యకు ప్రజలే సొంత ఖర్చులతో పైపులు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారులు స్పందించి కాలనీ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.