హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాత్యాయని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు

KNR: కరీంనగర్ పట్టణంలో శ్రీ దేవి నవరాత్రోత్సవాల్లో భాగంగా మహాశక్తి ఆలయంలో అమ్మవారు ఆరవ రోజు శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ సరస్వతి దేవి (కాత్యాయని) అవతారంలో దీపాల అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు దర్శనమిచ్చారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.