హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోళ్లపహాడ్ గ్రామంలో పత్తి పంటను సందర్శించిన ఏఈవో

ASF: రెబ్బెన మండలం రోళ్లపహాడ్ గ్రామంలో పత్తి పంటను సందర్శించిన ఏఈవో వినోద్ కుమార్ రైతులకు జిగురు అట్టల వినియోగంపై అవగాహన కల్పించారు. రసం పీల్చే పురుగుల ఉద్ధృతిని తగ్గించేందుకు ఎకరానికి 7-8 పసుపు రంగు జిగురు అట్టలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇవి తెల్లదోమ, పేనుబంక వంటి పురుగులను ఆకర్షించి వాటి ఉద్ధృతిని తగ్గించడంలో ఉపయోగపడతాయని తెలిపారు.