HYD: దోమల వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక ఫాగింగ్ డ్రైవ్ చేపడుతోంది. డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నుంచి ప్రజలను రక్షించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. నీటి నిల్వ పాత్రలపై మూతలు ఉంచాలని, టైర్లు, కుండీల్లో నిల్వ నీటిని తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులు ప్రజలను కోరారు.
తెలంగాణ
సైబరాబాద్లో దోమల నివారణకు ఫాగింగ్


