హైదరాబాద్: 28°C
తెలంగాణ

అడెల్లి శ్రీ మహా పోచమ్మ క్షేత్ర విశేషాలు

NRML: సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామ శివారులో సహ్యాద్రి పర్వత శ్రేణుల్లోని ఏకశిలపై శ్రీ మహా పోచమ్మ కొలువుదీరింది. స్థలపురాణం ప్రకారం.. కరువుతో అల్లాడిన ప్రజలను ఆదుకునేందుకు శివుడు తన కుమార్తె పోచమ్మను పంపినట్లు ప్రతీతి. ఆలయంలో బ్రహ్మ, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి రూపాల్లో ఏడుగురు అక్కాచెల్లెళ్లు కొలువుదీరారు. ఆలయానికి నైరుతి దిశలో పవిత్ర కోనేరు ఉంది.