హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు శంకుస్థాపన

జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో రూ.2.77 కోట్లతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, కలెక్టర్ బి. సత్య ప్రసాద్ శంకుస్థాపన చేశారు. సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే కాలనీలో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు.